నమస్తే నెట్వర్క్, మే 16: ఉమ్మడి జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపు లతో జోరు వాన కురుస్తోంది. వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో వరద నీరు రోడ్ల మీద ప్రవహించింది. అండర్ బ్రిడ్జి ప్రధాన రహదారిపై వర్షం నీరు నిలువడంతో పాద చారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
జయశంకర్ భూపాల పల్లి జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. దీంతో సుమారు 2 గంటల సేపు విద్యుత్‌కు అంతరాయం కలిగింది. గణపు రం మండలం కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో కుండ పోత వర్షం కురిసింది. రాత్రి 8 గంటలకు ప్రారంభమైన వర్షం మూడు గంటలసేపు కురిసింది. జనగామలో ఓ మోస్తరు వాన పడింది. మహబూబాబాద్ పట్టణంలో భారీ వర్షం కురి సింది. దీంతో కాలనీలోని రోడ్లపైన నీరు నిలి చింది. ఐనవోలు, మడికొండ, కాజీపేట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
వరంగల్, మే 16: నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో బల్దియా అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి నుంచే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 24 గంటలు పనిచేసేలా సిబ్బందిని నియమిస్తూ కమిషనర్ అశ్విని తానా జీ వాకడే ఉత్తర్వులు జారీ చేశారు. 9701999645, 9701 999676 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.