నాగర్ కర్నూల్ : జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం ( Heavy Rain ) కురిసింది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాల కాలనీలకు భారీగా వర్షం నీరు చేరుకుంది.
పట్టణంలోని 9వ జంక్షన్, అంబేద్కర్ చౌరస్తా, నాగునులు చౌరస్తా, లిటిల్ ఫ్లవర్ స్కూలు ప్రాంతాల్లోని ప్రధాన రహదారిపై వర్షం నీరు నిలవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది . ఈ సందర్భంగా కిలోమీటర్ పొడవున వాహనాలు నిలిచిపోయాయి.
రోడ్డు పొడవున డివైడర్ ఉండడంతో ఎత్తు ప్రాంతాల నుంచి మినీ ట్యాంక్ బండ్ (కేసరి సముద్రం చెరువు) వైపు వెళ్లాల్సిన వర్షం నీరు ప్రధాన రోడ్డుపై నిలిచిపోయింది. పోలీసులు వాహనాలను మళ్లించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. డివైడర్ నాలుగు ఫీట్ల ఎత్తులో ఉండడంతో వర్షపు నీరుతో నిండిపోయాయి. విద్యా సంస్థలు వదిలే సమయంలో ఒక్కసారిగా స్కూల్ బస్సులు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు రోడ్లపైకి రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.