భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా ‘హరిత’ యజ్ఞానికి ప్రభుత్వం పూనుకున్నది. ఇందులో భాగంగా శనివారం చేపట్టిన ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పండుగలా సాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ఒక్కరోజే సుమారు 14లక్షలకు పైగా మొక్కలు నాటారు. పాలకుర్తి సోమనాథుడి స్మృతి వనంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హరితయజ్ఞంలో పాలుపంచుకున్నారు. హనుమకొండ హౌసింగ్ బోర్డ్ కాలనీలో చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, మేయర్ గుండు సుధారాణి, గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నర్సంపేట పట్టణం సర్వాపురంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, రంగశాయిపేటలోని మంకీ ఫుడ్ కోర్టులో వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మొక్కలు నాటారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 26 : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా ‘కోటి వృక్షార్చన’ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 లక్షలకు పైగా మొక్కలు నాటారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, విద్యార్థులు ఈ మహా క్రతువులో భాగస్వాములయ్యారు. పాలకుర్తిలోని సోమనాథుడి స్మృతి వనంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కలెక్టర్ శివలింగయ్యతో కలిసి మొక్క నాటారు. భూపాలపల్లిలోని జిల్లా ప్రధాన హాస్పిటల్ ఆవరణలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, చిట్యాల మండలం జడలపేట, నైన్‌పాకలో కలెక్టర్ భవేశ్ మిశ్రా మొక్కలు నాటారు. జనగామ మండలం ఓబుల్ కేశ్వాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్‌ఘన్‌పూర్‌లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ య్య కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని జగన్నాయకులగూడెం గ్రామ పరిధి అటవీ ప్రాంతంలో కలెక్టర్ శశాంక, డీఎఫ్‌వో రవికిరణ్‌తో కలిసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ మొక్కలు నాటారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలో జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, జాకారం మినీ గురుకులంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి హరిత యజ్ఞంలో భాగస్వా ములయ్యారు. నర్సంపేటలో సర్వాపురం 4వ వార్డులో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మొక్కలు నాటారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 51వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీ లో మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ కోటి వృక్షార్చన కార్యక్రమంలో పాల్గొ న్నారు. రంగశాయిపేటలోని మంకీఫుడ్ కోర్ట్‌లో మేయర్, కమిషనర్‌తోపాటు కలెక్టర్ ప్రావీణ్య మొక్కలు నాటారు.