ఘనంగా మాతృభాషా దినోత్సవం
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని మంగళవారం ఘనం గా నిర్వహించారు.
- తెలుగు భాషను నిర్లక్ష్యం చేయొద్దు
- ఉప్పరపల్లి జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం ఫ్లోరెన్స్
చెన్నారావుపేట, ఫిబ్రవరి 21: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని మంగళవారం ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పరపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, నృత్యప్రదర్శన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు హెచ్ఎం ఫ్లోరెన్స్ బహుమతులు ప్రదానం చేసి మాట్లాడారు. ఆంగ్ల భాషను నేర్చుకోవాలి. కానీ, మన మాతృభాష అయిన తెలుగును నిర్లక్ష్యం చేయొద్దని విద్యార్థులకు సూచించారు. ప్రపంచంలో ఎన్నో భాషలున్నా.. అందులో మాతృభాషా చాలా గొప్పదన్నారు. కార్యక్రమ సమన్వయకర్త వేముల మమత మాట్లాడుతూ మాతృభాష తల్లితో సమానమని, పసికందుకు తల్లిపాలు ఎంత ముఖ్యమో.. విద్యార్థులకు మాతృభాష అంతే అవసరమని వివరించారు. మాతృభాషను మరువనంత వరకు విద్యార్థులు విజయాల బాటలో విహరిస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమణారావు, బాలాజీరావు, ఉమారాణి, శ్రీనివాస్, సంతోష్‌కుమార్, ఉదయ్‌కుమార్, మాధవి, మమత, రవికుమార్, సుందర్, మురళి, కృష్ణ పాల్గొన్నారు.
మాతృభాషను మరువొద్దు
కరీమాబాద్: జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకున్నా మాతృభాషను మరువొద్దని చాణక్య పాఠశాల హెచ్ఎం అచ్చ వినోద్‌కుమార్ అన్నారు. విద్యానగర్‌లోని పాఠశాలలో మాతృభాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ మాతృభాషను కాపాడుకునేందుకు కృషి చేయాలని కోరారు. ‘దేశ భాషలందు తెలుసు లెస్స’ అని శ్రీకృష్ణదేవ రాయలు అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్, రహమత్, సుమన్, శ్వేత, కోమల, సంధ్య, ఇర్ఫాన్, శిరీష, శైలజ పాల్గొన్నారు.
భావవ్యక్తీకరణకు భాష అవసరం
పర్వతగిరి: భావవ్యక్తీకరణకు మాతృభాష ఎంతో అవసరమని విజ్ఞానభారతి విద్యాలయం కరస్పాండెంట్ అక్కినపెల్లి సతీశ్‌కుమార్ అన్నారు. చింతనెక్కొండలోని విజ్ఞానభారతి విద్యాలయంలో మాతృభాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాసం, పద్యాలు, కవితలు, కథల పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఇతర భాషలు ఎన్ని నేర్చుకున్నా మాతృభాషను నిర్లక్ష్యం చేయొద్దని సతీశ్‌కుమార్ విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రజిత, సుమలత, సంపత్, భిక్షపతి, నవీన్, శ్రీకాంత్, సరిత, శిరీష, మౌనిక, పద్మావతి, రాజేశ్వరి పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

