నెక్కొండ, మే 16 : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మండలంలోని దీక్షకుంట గ్రామానికి చెందిన హనుమాన్ మాలదారులు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి శుక్రవారం నెక్కొండ మండలంలోని దీక్షకుంట గ్రామం నుంచి పాదయాత్రగా బయలుదేరారు. దీక్షకుంటలో ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించి ఇరుముడులు కట్టుకున్న తరువాత హనుమాన్ మాలదారులు భక్తి పారవశ్యంతో పాదయాత్ర చేపట్టారు.
180 కిలోమీటర్ల పాదయాత్రను ఐదు రోజుల్లో పూర్తిచేసి హనుమాన్ జయంతి రోజు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఇరుముడి మొక్కలు చెల్లించి దీక్షను పూర్తి చేయనున్నట్లు మాలదారులు తెలిపారు. భక్తి పారవశ్యం పెంపొందించే విధంగా మాలదారుల పాదయాత్ర గ్రామాల్లో కొనసాగుతోంది. కాగా, అక్కినపల్లి వెంకటేష్, అక్కినపల్లి సిద్ధార్థ, పొగాకు రమేష్, మండల మహేష్, మండల అన్వేష్, పనుకంటి స్వామి రావు, మనుభూతుల శివాజీ, జక్కుల రవి, వల్లబోధి హరినాథ్ స్వాముల పాదయాత్ర శుక్రవారం నెక్కొండ మండలంలో కొనసాగింది.