హనుమకొండ, జూన్ 6: హనుమకొండ తహసీల్దార్ కర్ర శ్రీపాల్రెడ్డి(46) శుక్రవారం ఉద యం గుండెపోటుతో మృతిచెందా రు. కాలికి గాయమైనప్పటికీ కోలుకొని ఇటీవలే మళ్లీ విధుల్లో చే రారు. ఆయన మృతి విష యం తెలుసుకున్న సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.
ఈయన స్వ స్థలం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం కాగా ఉద్యోగరీత్యా హనుమకొండలోని కుడా కాలనీలో నివాసం ఉంటున్నారు. శ్రీపాల్రెడ్డికి భార్య సంధ్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి, తహసీల్దార్ బావ్సింగ్ శ్రీపాల్రెడ్డి మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు.