Hand Ball | హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 26 : హ్యాండ్‌బాల్ విన్నర్స్ టీజీటీడబ్ల్యూఆర్జేసీ కాటారం, రన్నర్స్‌గా టీడబ్ల్యూఎంఎస్ఎస్బీ కొత్తగూడెం రన్నర్స్‌గా, మూడోస్థానంలో టీజీడబ్ల్యూఆర్‌జేసీ కల్వకుర్తి, నాలుగో స్థానంలో ఏకశిల ఇంటర్నేషనల్ స్కూల్, మహబూబ్‌నగర్ నిలిచారు. గర్ల్స్‌లో టీడబ్ల్యూఎంఎస్ఎస్జీ ఆసిఫాబాద్ విన్నర్‌గా, జీహెచ్ఎస్ కరీమాబాద్ రన్నర్స్‌గా, మూడోస్థానంలో టీజీఆర్ఎస్ గర్ల్స్ బాలానగర్ జట్లు నిలిచాయి.
తెలంగాణ హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాయిని విశాల్‌రెడ్డి మెమోరియల్ 7వ తెలంగాణ రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్ ట్యాలెంట్ హాంట్ అండర్-15 బాలబాలికలకు హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లోని హ్యాండ్‌బాల్ కోర్టులో నిర్వహించారు. మూడురోజుల పాటు నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 300 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని వారి ప్రతిభను చాటారు.
ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఒలింపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి కైలాస్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ క్రీడలు మానసికొల్లాసానికి ఎంతో దోహదపడతాయన్నారు. క్రీడలతో ఉజ్వల భవిష్యత్ ఉందని, వరంగల్ నుంచి ఎంతోమంది క్రీడాకారులు ప్రతిభచాటి జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.
హ్యాండ్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి శ్యామల పవన్‌కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 300 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, వారికి మూడురోజులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభచాటి పతకాలు సాధించారన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఖోఖో అసోసియేషన్ సెక్రటరీ శ్యామ్, కోచ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు మెడల్స్‌తో పాటు షీల్డ్ లు అందజేసి అభినందించారు.