హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 11: వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాటయోధుడు, మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ పాత్ర అనే అంశంపై తొర్రూర్ తిరుమల గార్డెన్లో 12న జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఎంసిపిఐ(యు) పార్టీ హనుమకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ అంబేద్కర్ సెంటర్లో వారు కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా హంసారెడ్డి మాట్లాడుతూ ఎంసిపిఐ(యు) పార్టీ వ్యవస్థాపకుడు ఓంకార్ శత జయంతి సందర్భంగా పార్టీ తెలంగాణ రాష్ర్ట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సుకు అన్నివర్గాల ప్రజలు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర సదస్సుకు వివిధ వామపక్ష కమ్యూనిస్టు నాయకులు హాజరవుతారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గడ్డం నాగార్జున, మాస్ సావిత్రి, కర్ర రాజిరెడ్డి, చీపురు ఓదయ్య, జిల్లా కమిటీ సభ్యులు మొగిలి శ్రీనివాసరావు, పార్టీ సభ్యులు సీతారాంరెడ్డి, పాల్గొన్నారు.