Hadupsa | హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 28: హడుప్సా ఆధ్వర్యంలో ఈనెల 29, 30 తేదీల్లో కాజీపేట కడిపికొండ విశ్వశాంతి హైస్కూల్లో సైన్స్ కార్నివాల్ నిర్వహిస్తున్నట్లు హడుప్సా అధ్యక్షుడు టి.బుచ్చిబాబురావు తెలిపారు. ఉదయం 9 గంటలకు జిల్లా విద్యాశాఖాధికారి లింగాల వెంకటగిరిరాజ్గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని, ప్రత్యేక అతిథులుగా కాజీపేట ఎంఈవో బి.మనోజ్‌కుమార్, ఆదర్శ లా కళాశాల చైర్మన్ బూర విద్యాసాగర్, డీఎస్వో సుదర్శన శ్రీనివాసస్వామి, హడుప్సా అడ్వైజర్ పి.వేణుమాధవరావు పాల్గొంటారని పేర్కొన్నారు.
30న జరిగే ముగింపు కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ పి.ప్రశాంత్‌రెడ్డి, హనుమకొండ ఎంఈవో జి.నెహ్రూనాయక్, హడుప్సా అడ్వైజర్లు వీ జనార్ధన్, ఎన్.శ్రీనివాసరెడ్డి, పి.వెంకటరమణా హాజరవుతారని చెప్పారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు సైన్స్ కార్నివాల్ ఎంతో ఉపయోగపడుతుందని హడుప్సా అధ్యక్షుడు బుచ్చిబాబురావు తెలిపారు.