మరిపెడ : స్వేచ్ఛ, సమానత్వం, బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని సోమవారం మరిపెడ పురపాలక సంఘం పరిధిలోని అందరికి యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవీన్ రావు హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం చుట్టూ నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ, రైలింగ్‌ను ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలో కల్పించిన హక్కులు, అంబేద్కర్ ఆశయాల యువత కోసం నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు బాష్పంగా రంజిత్, యూత్ సభ్యులు హరీష్, విజయ్, రాకేష్, జగదీష్, శ్రీకాంత్, మనోజ్, మోహన్, భాస్కర్, రాము, డేవిడ్ రాజు, మంద వెంకన్న, మాజీ కౌన్సిలర్ ఉరుకొండ శ్రీనివాస్ , హథిరాం,సైదులు, గోల్కొండ వెంకన్న, ఏటీఎం కృష్ణ, సురేష్, వెంకన్న, పట్టే కాటయ్య, శ్రీరాములు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.