Bhimadevarapally | భీమదేవరపల్లి, ఏప్రిల్ 03 : రజక సహకార సంఘం ముల్కనూరు నూతన అధ్యక్షులుగా గుడికందుల శంకరయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ముల్కనూరులోని రజక సహకార సంఘంలో నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి.
అధ్యక్షులుగా గుడికందుల శంకరయ్య, ఉపాధ్యక్షులుగా గుడికందుల సంపత్, గౌరవ అధ్యక్షులుగా గుడికందుల కనుకయ్య, సలహాదారులుగా గుడికందుల చిన రాజమౌళి, గుడిగందుల సమ్మయ్య, కార్యవర్గ సభ్యులుగా గుడికందుల విజయ్ కుమార్, రాజేందర్, కుమారస్వామి, రాజు, సిర్ర కనకయ్య, గుడికందుల అంగడి రాజు, బాలరాజు, సదానందం, శ్రీనివాస్, డీలర్ రాజు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన గుడికందుల శంకరయ్య మాట్లాడుతూ రజక సహకార సంఘం బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనను అధ్యక్షులుగా ఎన్నిక చేసిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.