హనుమకొండ (ఐనవోలు): ఒంటిమామిడిపల్లి మల్లికార్జునస్వామి ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిగా గూడ రాజు(సునీల్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ఒంటిమామిడిపల్లిలో మల్లికార్జునస్వామి ట్రాక్టర్ యూనియన్ సభ్యులు 26 మంది ప్రత్యేక సమావేశంలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో యూనియన్ పాలకవర్గం ఎన్నిక జరిగింది.
ఉపాధ్యక్షుడిగా కూస విజేందర్, కార్యదర్శిగా గోపతి శేఖర్, సహాయ కార్యదర్శిగా ఏసిరెడ్డి రాజిరెడ్డి, కార్యవర్గ సభ్యులు గూడ సంపత్, పెండ్లి కుమార్, ఇంతల రాజు, గోనే రాజిరెడ్డి, పెంతల రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ.. తను ట్రాక్టర్ యూనియన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికకు సహకరించిన సభ్యులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.