కరీమాబాద్ మార్చి 19 : వరంగల్(Warangal) తూర్పు నియోజకవర్గం 32వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా కార్పొరేటర్ పల్లం పద్మ ఎస్ఆర్ఆర్ తోట బొడ్రాయి సమీపంలో కమ్యూనిటీ హాల్ (గ్రంథాలయ) భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామన్నారు.
విద్యార్థులకు, నిరుద్యోగులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా గ్రంథాలయాన్ని త్వరగా నిర్మించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ఏఈ ముజామిల్, గ్రంథాలయ కమిటీ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు పల్లం రవి, కత్తెరసాల వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.