సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని గురువారం గురుపూజోత్సవాన్ని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అన్ని విద్యాసంస్థల్లో గురువులను పూలమాలలు, శాలువాలతో విద్యార్థులు సన్మానించి ఆటపాటలతో సందడి చేశారు.
అలాగే కలెక్టరేట్లలో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు సత్కరించి పురస్కారాలు, జ్ఞాపికలు అందించారు. కాలానుగుణంగా విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా వారి భవ్యషత్తును తీర్చిదిద్దాలని వారు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.