హనుమకొండ, నవంబర్ 25 : గ్రామ పంచాయతీల ఎన్నికల నగా రా మోగింది. ఇప్పటికే సర్పంచ్లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు పూర్తికావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని మంగళవారం షెడ్యూల్ను ప్రకటించారు. దీంతో పల్లెల్లో స్థానిక సందడి జోరందుకుంది. దీంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అధికారులు ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఓటరు జాబితా, పోలింగ్ స్టేషన్ల సామగ్రితో పాటు రిజర్వేషన్ల ప్రక్రి య పూర్తయింది. అలాగే రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్, ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ పూర్తిచేశారు. అయితే ఒ క్కో విడతకు రెండు రోజుల వ్యవధి ఉండగా, ఓటింగ్ రోజే ఫలితాలు వెల్లడించనున్నారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక జరగనుంది. ఒకవేళ ఏదైనా కారణంతో ఎన్నిక జరగని పక్షంలో మరుసటి రోజు (సెలువు దినం ఉన్నా) ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు షెడ్యూల్లో పేర్కొన్నారు.
మద్దతు కూడగట్టుకునేందుకు..
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో పోటీ చేయాలనుకొనే ఆశావహులు మద్దతు కూడగట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించారు. తమ వర్గాలు, గ్రూపులను పోగేసుకోవడంతో పాటు తమ ప్రాతినిధ్యాన్ని బలపర్చాలని ముఖ్య కార్యకర్తలు, అనుచరులను కోరుతున్నారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో కొందరు అభ్యర్థులు తమ భార్యలను రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి నుంచి ఆయా పార్టీల పెద్దలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులను ప్రసన్నం చేసుకొని ఎలాగైనా పోటీలో నిలిచేందుకు యత్నిస్తున్నారు. ఓటర్లను కూడా ప్రసన్నం చేసుకొనే పనిలో పడ్డారు.
షెడ్యూల్ ఇలా..
