ఫుకెట్: హైదరాబాద్ నుంచి ఫుకెట్‌కు వెళ్లిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండింగ్ సమయంలో ముందరి చక్రం(నోస్ వీల్) దెబ్బ తినడంతో రన్ వేపై నిలిచిపోయింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు.
ఈ ఘటన కారణంగా ఆరు గంటల పాటు రన్ వేపై ఆపరేషన్స్ నిలిపేశారు. ఘటనలో సమయంలో విమానంలో 133 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రామాణిక ప్రొటోకాల్స్ పాటించి ప్రయాణికులందరినీ విమానం నుంచి సురక్షితంగా కిందకు దించినట్టు ఎయిరిండియా సంస్థ తెలిపింది. ప్రమాదానికి గురైన విమానాన్ని రన్‌వే పై నుంచి పక్కకు తొలగించడానికి అధికారులు చర్యలు ప్రారంభించారు.