బచ్చన్నపేట/బయ్యారం, నవంబర్ అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది. ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతులు బచ్చన్నపేట మార్కెట్‌కు తరలించి ఆరబోసుకోగా శుక్రవారం కురిసిన వర్షానికి ధాన్యం తడిసింది. మార్కెట్‌ను సందర్శించిన జేసీ బాధిత రైతులు, సివిల్‌సైప్లె డీఎంతో మాట్లాడారు. తడిసిన మూడు లారీల లోడ్ ధాన్యాన్ని వెంటనే కాంటా వేసి మిల్లుకు పంపాలని ఆదేశించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి, మండల ప్రత్యేకాధికారి రామారావునాయక్, ఏపీఎం నాగేశ్వర్రావు, తహసీల్దార్ ప్రకాశ్‌రావు, ఎంపీడీవో మల్లికార్జున్, ఆర్ఐ మున్వర్ పాల్గొన్నారు. అదేవిధంగా బయ్యా రం ఏజెన్సీలోని గ్రామాల్లో మక్కజొన్నను అమ్ముకునేందుకు రైతులు ఆరబోసుకున్నారు. శుక్రవారం వర్షం కురిసి రైతులకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంట తడవడంలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.