దేవాదుల పనులను పూర్తిచేస్తాం
దేవాదుల ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అడ్డంకులను తొలగించి, పెండింగ్ బిల్లులు చెల్లించి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగు నీరందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.
- పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లిస్తాం
- ఆయకట్టుకు పూర్తి స్థాయిలో సాగు నీరందిస్తాం
- డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, పొంగులేటి
ములుగు, జూలై 13 (నమస్తే తెలంగాణ)/కన్నాయిగూడెం : దేవాదుల ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అడ్డంకులను తొలగించి, పెండింగ్ బిల్లులు చెల్లించి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగు నీరందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం వారు ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెంలోని సమ్మక్క బరాజ్‌తో పాటు జే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పంపుహౌస్‌లోని మోటర్లను పరిశీలించి అధికారులతో సమీక్షించారు.
డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను ముందుగానే అంచనా వేసి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాగు, తాగు నీ టి అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందన్నారు. గోదావరి నీటిని గరిష్ఠ స్థాయిలో వినియోగించుకునేందుకు ఖర్చుకు వె నుకాడకుండా స్పష్టమైన నిర్ణయాలతో ముందుకు సాగుతామని తెలిపారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రాజెక్టులో ఉన్న 10 పంపులలో ప్రస్తుతం ఏడు పనిచేస్తున్నాయని, మరో రెండు రోజుల్లో పూర్తి స్థాయి మోటర్లను వినియోగించి 22 రిజర్వాయర్లను నింపుతామన్నారు.
పనులకు సంబంధించి రూ. 194 కోట్ల పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. భూ సేకరణ కారణంగా ప్రాజెక్టు పనులు ఆగకుండా చూస్తామన్నారు. పొంగులేటి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టు ద్వారా 6.14 లక్షల ఎకరాలకు సాగు నీరందించే అ వకాశం ఉందని, ఇందులో దాదాపు 92 శాతం ఆయకట్టు ఉమ్మడి వ రంగల్ జిల్లాలో, మిగిలింది నల్లగొండ జిల్లాలో ఉందన్నారు. ప్రాజెక్టు లక్ష్య సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయన్నారు. వారి వెంట కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, ఎమ్మెల్యేలు కడి యం శ్రీహరి, నాగరాజు, యశస్వినీరెడ్డి, అదనపు కలెక్టర్లు ఉన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

