నర్సంపేట, మే 6 : ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని యువత ప్రజల్లోకి తీసుకెళ్లాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సూచించారు. శనివారం నర్సంపేటలోని పద్మశాలీ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ శ్రేణులకు సోషల్‌మీడియా వాడకంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలను సోషల్‌మీడియా వేదికగా ప్ర మోట్ చేయాలన్నారు. ప్రమోట్ చేయడంలో మెలకువలు పాటించాల్సినవసరం ఉందన్నారు. దీనికి సంబంధించిన నైపుణ్యతను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ైస్లెడ్స్ ద్వారా తెలుసుకోవాలన్నారు. ప్రతి పక్షాలు ఫేక్ వార్తల క్రియేషన్స్ ద్వారా ఉద్దేశ్య పూర్వకంగానే ప్రభుత్వాన్ని అబాసుపాలు చేస్తున్నదని ఆరోపించారు.
ప్రజలను ఏవిధంగా తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సరైన విషయ పరిజ్ఞానంతో ప్రతిపక్షాలకు కౌంటర్ వేసే విధానంతో పాటు, మనం ప్రమోట్ చేయదలచుకున్న ఆంశం ఎక్కువ మందికి చేరేందుకు సంబంధించిన టెక్నికల్ స్కిల్స్‌ను నేర్చుకోవాలని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ మందికి కంటెంట్ రిచ్ అయ్యేలా సామాజిక మాధ్యమాల్లో ప్రతి ఒక్కరికీ మనం చెప్పదల్చుకున్న విషయం చేరే విధానాన్ని నేటి సమావేశం వేదిక శిక్షణ ఇస్తున్నామన్నారు. అభివృద్ధిని సోషల్ మీడియా ద్వా రా పంచుకోవాలని తెలిపారు.
నర్సంపేట ని యో జకవర్గంలోని ఉత్సాహవంతమైన యువత, సోష ల్ మీడియా వారియర్స్ ఈ ప్రాంత అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు. త్వరలో పార్టీ నాయకులు, నియోజకవర్గ యువత, సోషల్‌మీడియా వారియర్స్‌తో కలిపి పెద్ద ఎత్తున ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తామన్నారు. నియోజకవర్గ వ్యాప్తం గా అన్ని మండలాల నుంచి 1200 మంది ఈ శిక్షణలో పాల్గొన్నారన్నారు. దీనిలో నేర్చుకున్న పలు అంశాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సినవసరం ఉందన్నారు. ముందుగా పట్టణంలో బీఆర్ఎస్ యూత్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. నామాల సత్యనారాయణ, దుశ్యంత్ రెడ్డి, రవి చైతన్య, రాజేశ్వర్‌గౌడ్, ప్రవీణ్‌గౌడ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.