నర్మెట, మే 29: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు- మన బడి’తో సర్కారు స్కూళ్లు కార్పొరేట్‌కు దీటుగా మారుతున్నాయని రాష్ట్ర విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బొమ్మకూరు,, మచ్చుపహాడ్ ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టిన వాటర్ ట్యాంక్, ప్రహరీగోడ నిర్మాణం, తరగతి గదుల్లో విద్యుత్ సౌకర్యం పనులు పరిశీలించారు.
ఈ సందర్భంగా రావుల శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి సీఎం కేసీఆర్ ‘మన ఊరు – మన బడి ’ కార్యక్రమం చేపట్టారని వివరించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, డ్యుయల్ డెస్కులు, అదనపు తరగతి గదులు, వంటశాలలు, విద్యుత్ సౌకర్యం, ప్రహారీల నిర్మాణం చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యమిస్తున్నారని ఆయన తెలిపారు. సమైక్య పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధిని విస్మరించారని పేర్కొన్నారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభు త్వం కృషి చేస్తున్నదన్నారు. ఇందుకు అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాలోత్ శ్రీనివా స్, డీఈవో రాము, ఈఈ నరేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు బానోత్ శంకర్‌నాయక్, రామిని శివరాజ్, డీఈ నర్సింహాచారి, ఏఈ వెంకట్‌నర్సు, నోడ ల్ అధికారి వెంకట్‌రెడ్డి, హెచ్ఎం కవిత, ఎస్ఎంసీ చైర్మన్లు నిమ్మనబోయిన మల్లేశ్, రవి, మాజీ ఎంపీటీసీ పోలెపాక తిరుపతి, సీఆర్పీ రవీందర్, నాయకులు వెంకటయ్య, బీంసింగ్ పాల్గొన్నారు.