పేదల కోసం పోరాడిన యోధుడు భగవాన్‌దాస్
పేదల బాగు కోసం జీవితాంతం పోరాడిన యోధుడు బీఆర్ భగవాన్‌దాస్ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్ అన్నారు. గురువారం సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు బీఆర్ భగవాన్ దాస్ 93వ జయంతి వేడుకులను ఘనంగా నిర్వహించారు.
- ఆయన స్ఫూర్తితోనే గుడిసెవాసులందరికీ పట్టాలు
- ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్
- ఘనంగా బీఆర్ భగవాన్‌దాస్ జయంతి
హనుమకొండ చౌరస్తా, జూన్ 8 : పేదల బాగు కోసం జీవితాంతం పోరాడిన యోధుడు బీఆర్ భగవాన్‌దాస్ అని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాసర్ అన్నారు. గురువారం సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు బీఆర్ భగవాన్ దాస్ 93వ జయంతి వేడుకులను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమకొండ అశోకా జంక్షన్‌లోని భగవాన్‌దాస్ విగ్రహానికి చీఫ్ విప్‌తోపాటు ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తకళ్లపల్లి శ్రీనివాసరావు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చీఫ్ విప్ వినయ్‌భాసర్ మాట్లాడుతూ వరంగల్ నగరంలో సంఘటిత, అసంఘటిత రంగంలోని కార్మికుల హకుల కోసం బీఆర్ భగవాన్‌దాస్ పోరాడారన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు కోచ్ ఫ్యాక్టరీ, ఇతర పరిశ్రమల సాధన, నగరానికి తాగునీటి కోసం పోరాడారని గుర్తుచేశారు. ఆనాడు భగవాన్‌దాస్ స్థాపించిన గుడిసెల కాలనీల్లో పేదలకు నేడు సీఎం కేసీఆర్ సహకారంతో ఇండ్ల పట్టాలు అందించినట్లు తెలిపారు. పట్టాలు ఇచ్చేక్రమంలో ఎంతో మంది పేదలు బీఆర్ భగవాన్‌దాస్‌ను స్మరించుకుంటున్నారన్నారు. ఆయన స్ఫూర్తితోనే మిగిలిన గుడిసెవాసులందరికీ త్వరలోనే పట్టాలు అందిస్తామన్నారు. ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య మాట్లాడుతూ వరంగల్ నగర ప్రజలకు తాగునీటి కోసం భగవాన్‌దాస్ ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా అఖిల పక్షాలను కలుపుకుని వరంగల్ బంద్‌కు పిలుపునిచ్చారనానరు. దీంతో తాగునీటి సమస్య పరిషారమైందని గుర్తు చేశారు. పార్టీలు, సిద్ధాంతాలు వేరైనా బీఆర్ భగవాన్‌దాస్ సూచించిన మార్గంలోనే నేడు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిషరిస్తోందన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు తకళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీఆర్ భగవాన్‌దాస్ చూపిన బాటలోనే ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేశ్, డాక్టర్ బీఆర్ అంబేదర్, డాక్టర్ రాజ్ సిద్ధార్థ, బీఆర్ లెనిన్, టీయూడబ్ల్యూజే ప్రధాన జిల్లా కార్యదర్శి తోట సుధాకర్, సీపీఐ నాయకులు ఎన్ రాజమౌళి, కొట్టెపాక రవి, మునిగాల భిక్షపతి, మాలోతు శంకర్, కండె నర్సయ్య, రమేశ్ దేవ, జితేందర్, సంజయ్, కృష్ణమూర్తి, ప్రకాశ్ పాల్గొన్నారు.
చాయ్ తాగిన చీఫ్ విప్
కాగా, చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అశోకా థియేటర్ పక్కన గల కేఫ్‌లో చాయ్ తాగారు. కేఫ్‌కు వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కొద్దిసేపు ముచ్చటించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, బీఆర్ లెనిన్, కేఫ్ యజమాని శ్రీనివాస్, నాయకులు ఉన్నారు.
బాబా ఆలయంలో చీఫ్ విప్ పూజలు
హనుమకొండ : హనుమకొండలోని షిర్డీ సాయిబాబా దేవాలయంలో ప్రభు త్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ గురువారం పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం బాబా శేష వస్త్రంతో ఘనంగా సత్కరించారు. అర్చకులు మణిశర్మ, చందు, ధర్మకర్తలు నిమ్మల శ్రీనివాస్, రాకం సదానందం, వెయ్యిగండ్ల రమేశ్, భక్తులు పాల్గొన్నారు.
లక్ష్మీనారాయణ మృతి తీరని లోటు
కాజీపేట : తెలంగాణ ఉద్యమ సమయంలో రైల్వే రిటైర్డ్ కార్మికులను ఏక తాటిపైకి తీసుకొచ్చిన కార్మిక నాయకుడు లక్ష్మీనారాయణ మృతి బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాజీపేట 47వ డివిజన్ బాపూజీనగర్‌లో కార్మిక నాయకుడు లక్ష్మీనారాయణ ఇటీవల మరణించగా బాధిత కుటుంబాన్ని గురువారం చీఫ్ విప్ పరామర్శించారు. నియోజక వర్గంలోని ప్రజలకు ఏమైన సమస్యలు వస్తే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మైసారపు సిరిల్ లారెన్స్, మర్యాల కృష్ణ, జేరిపోతుల వెంకన్న, ఎండీ మతిన్, సల్లూరి నాగేశ్వర్రావు, భిక్షపతి, శ్రీనివాస్, జానకీరామ్, సిరిపాక కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

