మహబూబాబాద్ : గ్రామాల్లో ఉన్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అన్నారు. గురువారం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కుటుంబ కుల గణన సర్వే ఆధారంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామాలలో ఇందిరమ్మ కమిటీ పేర్లతో ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయటం సరైన విధానం కాదన్నారు. ప్రభుత్వ అధికారుల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మండల వెంకన్న, లింగన్న, దేవేందర్, సైదులు, రాములు, తదితరులు పాల్గొన్నారు.