వర్ధన్నపేట : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల గ్రామంలో చెంగల సురేష్ 31 అనే గీత కార్మికుడు ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుంచి పడటంతో మృతిచెందాడు. శుక్రవారం సాయంత్రం రోజు మాదిరిగానే తాడిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా మోకుజారి కింద పడిపోయాడు.
దాంతో సురేష్‌కు తల, మెడ భాగంలో బలమైన గాయాలయ్యాయి. దాంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.