కాటారం/మహదేవపూర్/కాళేశ్వరం/వాజేడు/ఏటూరునాగారం: జిల్లాలో శుక్రవారం వాన ముంచెత్తింది. కాటారం మండలంలో 141.8 మి.మీ వాన పడడంతో జనజీవనం స్తంభించింది. మహదేవ పూర్, భూపాలపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో చెరువులు మత్త ళ్లు పోయగా, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాటారం మండలంలోని గంగా రం అలుగువాగు, పోతుల్ వాయి బొర్రవాగు, ఒడిపిలవంచ బండల వాగు, మల్లారం అలుగువాగు భారీ వర్షానికి పొంగి పొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
దామెర కుంట-గుండ్రాత్ పల్లి మధ్యలోని అలుగు వాగులో బొలెరో ట్రాలీ వాహనం కొట్టుకు పోయింది. గ్రామస్తులు డ్రైవర్‌ను రక్షించారు. ఎలాంటి అవాంఛనీ య ఘటనలు జరుగకుండా పోలీసు, రెవెన్యూ అధికారులు ముంద స్తు చర్యలు చేపట్టారు. మహాము త్తా రం మండలం నిమ్మగూడేనికి చెందిన టీ శంకర్‌కు తేలు కుట్టగా, 108కి ఫోన్ చేయగా అంబులెన్స్ పోతుల్వా యి వద్దకు రాగానే వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో నిలిచిపో యింది. శంకర్‌ను అధికారులు, స్థానికులు వాగు దాటించి 108 అంబులెన్స్‌లో మహదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు ఉధృతంగా ప్రవహి స్తూ 3.73 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. 08.01 మీటర్ల ఎత్తులో పారుతూ లక్ష్మీ బరాజ్ వైపు పరుగులు తీస్తున్నాయి. గంట గంటకూ భారీగా పెరుగుతుండడంతో అధికారులు అక్కడే ఉండి పర్యవేక్షిస్తు న్నారు. వాజేడు మండలంలోని పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి ఉప్పొంగి పారుతోంది. పేరూరు వద్ద 12.730 మీటర్లు(40) అడుగు లకు నీటిమట్టం చేరుకున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. ఏటూరునాగారం పుష్కరఘాట్ వద్ద 11.710 మీటర్లతో గోదావరి ప్రవహిస్తుంది. దీంతో దెబ్బతిన్న కరకట్ట వద్ద నీటి పారుదలశాఖ అధికారులు ఇసుక బస్తాలు వేసి పనులు చేస్తున్నారు.
వెంకటాపురం(నూగూరు): మండల పరిధిలోని అలుబాక పంచా యతీ తానిపర్తి గ్రామానికి చెందిన బానారి రాజు(45) చేపల వేటకని గురువారం గోదావరి నదికి వెళ్లి గల్లంతయ్యాడు. రెవెన్యూ, పోలీస్ అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.