బచ్చన్నపేట జూన్ 1: గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఉచిత వైద్య సేవ అందించడమే లక్ష్యంగా లయన్స్ క్లబ్ బచ్చన్నపేట ముందుకు సాగుతుందని క్లబ్ అధ్యక్షులు గంగం సతీష్ రెడ్డి అన్నారు. ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రతినిధులు జన్మదినోత్సవాలు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ఈదులకంటి ప్రతాప్ రెడ్డి, చల్లా శ్రీనివాస్ రెడ్డి, రామిని మదన మోహన్, మూసిని రాజు, మల్లవరం వెంకటేశ్వర రెడ్డి, కొయ్యాడ శ్రీనివాస్, మేకల రంగా రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాట చేసిచ మందులు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో క్లబ్ ఆవిర్భవించినప్పటి నుండి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు రంజిత్ కుమార్, విజ్ఞశ్రీ, నిశాంత్, ప్రీతి దయాళ్, సృజన్ కుమార్, శివ, కనక రాజు, సంతోషిణి, స్వప్న మూర్తి, లింగమూర్తి, నవీన్, సతీష్ సేవలు అందించగా లయన్స్ కార్యవర్గ సభ్యులు, బద్దిపడగ గోపాల్ రెడ్డి, మట్టి శ్రీనివాస్, ఫిరోజ్, జిల్లా రాజేశ్వర్, జిల్లా రాజు, వెల్దుర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.