బచ్చన్నపేట జూన్ 29 : కరువు ప్రాంతమైన బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న చెరువులు, కుంటలను వెంటనే గోదావరి జలాలతో నింపి రైతాంగని ఆదుకోవాలని సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లు గోదావరి జలాలతో నింపామని, దీంతో రైతులు రెండు పంటలు పుష్కలంగా పండించారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు సంక్షేమాన్ని విస్మరించిందని మండిపడ్డారు. చెరువులు, కుంటలు ఎండిపోయి ఎక్కిరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
చెరువుల్లో నీళ్లు లేని కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతన్నల బోర్లు ఎండిపోతున్నాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను భూమాత ద్వారా వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ ప్రాతం వాళ్లు కేవలం వర్షాధారం మీదనే ఆధారపడి వ్యవసాయం చేసుకుంటున్నారని, ఇందుకుగాను గోదావరి జలాలతోనే చెరువులు నింపడం శరణ్యమన్నారు. ఆయన వెంట పలువురు బీఆర్ఎస్ నేతలు కరికే కరుణాకర్, మినలాపురం కనకయ్య తదితరులు ఉన్నారు.