రాష్ట్రంలో గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఆయన నివాసంలో గీసుగొండ, సంగెం, ఖిలావరంగల్ మండలాలకు చెందిన 63 మందికి గురువారం కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం గీసుగొండ మండలం సూర్యతండా గ్రామానికి చెందిన 15 మంది కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. వీరికి ఎమ్మెల్యే చల్లా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పారదర్శక పాలన అందిస్తున్నారని, రాష్ట్రంలో విపక్షాలకు స్థానం లేదని స్పష్టం చేశారు.
– గీసుగొండ, అక్టోబర్ 13
గీసుగొండ, అక్టోబర్ 13 : దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా తెలంగాణలో గడపగడపకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని సంగెం, గీసుగొండ, ఖిలా వరంగల్ మండలాలకు చెందిన 63 మంది లబ్ధిదారులకు గురువారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. అనంతరం గీసుగొండ మండలం సూర్యతండా గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఉపసర్పంచ్ శ్రీనివాస్, నాయకులు కిషన్, నర్సింహ, భద్రు, రాజు, తిరుపతి, వీరన్న 15 మంది టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరారు. వీరికి ఎమ్మెల్యే చల్లా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశానికే మార్గదర్శకంగా తెలంగాణ రాష్ర్టాన్ని తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్దన్నారు.
రాష్ట్రంలో పారదర్శక పాలన చేస్తూ, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్కు అండగా ఉండాలని కోరారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు అకర్షితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని, రాష్ట్రంలో విపక్ష పార్టీలకు స్థానం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీకి దేశంలో, రాష్ట్రంలో కాలం చెల్లిందని, ఆ పార్టీలకు కార్యకర్తలు కరువయ్యారని ఎద్దేవా చేశారు. దేశ రాజకీయాల్లో కేసీఆర్ పాత్ర కీలకం కానుందన్నారు. అన్ని వర్గాల ప్రజలను బీజేపీ మోసం చేసిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, సంగెం ఎంపీపీ కందకట్ల కళావతి, కార్పొరేటర్లు ఆకులపల్లి మనోహర్, సుంకరి మనీషా, గద్దె బాబు, సూర్యతండా సర్పంచ్ వాంకుడోత్ రజిత, నాయకులు లెనిన్, వినోద్, బానోత్ వీరన్న, నర్సింగం, బానోత్ భద్రు, భూక్యా వీరన్న, బోడ చందర్ పాల్గొన్నారు.