హనుమకొండ(ఐనవోలు) : నందనం సొసైటీని వాణిజ్య బ్యాంకులకు దీటుగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ రవీందర్ రావు అన్నారు. నందనం రైతు సేవా సహకార సంఘం (FSCS) 53వ మహాజన సభలో పాల్గొన్న వైస్ చైర్మన్ చందర్ రావు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బ్యాంకు పరిపాలన నివేదిక, ఆర్థిక సంవత్సరం, ఖర్చు, లాభనష్టాలు తదితర అంశాలు మహాజన సభ ముందు ప్రవేశపెట్టామన్నారు. సహకార సంఘాలలోని సభ్యులకు బ్యాంకు ఖాతాదారులకు ఉచిత బ్యాంకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
కేవలం వ్యవసాయ రుణాలే కాక ఇతర వాణిజ్య బ్యాంకులకు దీటుగా అన్ని రకాల రుణ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. డిపాజిట్ల మీద ఇతర బ్యాంకుల కన్నా అత్యధిక వడ్డీలు చెల్లిస్తున్నామని తెలియజేశారు. మార్ట్ (రూరల్ సూపర్ మార్కెట్) ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం ఆదాయం 5 లక్షలు, ఫార్టిలైజర్ ద్వారా 8 లక్షల రూపాయలు, ఇతర వ్యాపారాల ద్వారా సొసైటీ కి 8 లక్షల వరకు ఆదాయం వచ్చిందని వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ తక్కళ్లపల్లి చందర్ రావు, డైరెక్టర్లు బుచ్చిరెడ్డి, ఎలేంద్ర, రామచంద్రం, యేసొబు, సంపత్ రావు, కుమార్, బాబు, సీఈఓ సంపత్ తదితరులు పాల్గొన్నారు.