Sagara Sangham | హసన్పర్తి : సగర సంఘం గుండ్ల సింగారం కమిటీ ఆధ్వర్యంలో వాసన్ ఐ కేర్ హాస్పిటల్ వైద్యులు మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 150 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా శస్త్ర చికిత్స అవసరమున్నవారికి రెపర్ చేశారు. ఈ సందర్భంగా గుండ్లసింగారం సగర సంఘం అధ్యక్షుడు కొడిపాక రాజయ్య మాట్లాడుతూ సగర సంఘం సభ్యుల సంక్షేమానికి పాటుపడతామని చెప్పారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని కోరారు.
తమ సంఘం సభ్యుల కోసం ఉచితంగా చికిత్స నిర్వహించిందుకు ఈ సందర్భంగా వాసన్ ఐకేర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సగర సంఘ నాయకులు సుతారి భిక్షపతి, దుంపల మహేందర్, కే రాజు దుంపల రవి, తాడిశెట్టి శ్రీధర్, ఎంజాల సుమన్, వాసన్ ఐకేర్ దవాఖాన సిబ్బంది అనిశెట్టి చేతన్, వినయ్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.