హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 6: హనుమకొండ కుమార్‌పల్లి మార్కెట్ రోడ్డులో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన కారు రెండు బైకులను, రోడ్డుపై వెళ్తున్నవారిని ఢీకొట్టి ట్రాన్స్ఫార్మర్ ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. ఎల్బీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ బి.మదన్మోహన్ నిర్లక్ష్యంగా అతివేగంగా కుమార్‌పల్లి మార్కెట్ వైపు వెళ్తూ రెండు బైకులను ఢీకొట్టాడు.
ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాపాయస్థితిలో ఉండగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఎంజీఎంకు తరలించారు. హనుమకొండ పోలీసులు అక్కడికి చేరుకుని కారు డ్రైవర్ మదన్మోహన్ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.