నమస్తే నెట్వర్క్, ఫిబ్రవరి 16 : బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, హరితహారం స్పృష్టికర్త కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం పలువురు మాజీ ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ హైదరాబాద్ హైదర్‌గూడలోని పార్కులో తన కుటుంబంతో కలిసి మొక్కలు నాటారు.
చల్లా ధర్మారెడ్డి హనుమకొండలోని తన నివాసంలో, తాటికొండ రాజయ్య స్టేషన్‌ఘన్‌పూర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయం వద్ద, మాజీ ఎంపీ, బీఆర్ఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత తన క్యాంప్ కార్యాలయంలో మొక్కలు నాటి నీరు పోశారు. సోమవారం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు మొక్కలు నాటాలని, సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.