డోర్నకల్, ఫిబ్రవరి 2 : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ ప్రజలకు పిలుపునిచ్చారు. డోర్నకల్ గడ్డపై గులాబీ జెండా ఎగరేసేందుకు శ్రేణులు కృషిచేయాలన్నారు. సోమవారం పట్టణంలోని జైన్‌భవన్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పట్టణం అభివృద్ధి చెందిందని, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటినప్పటికీ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.
రానున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలన్నారు. సమావేశంలో మహబూబాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కత్తెరశాల విద్యాసాగర్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ చేరెడ్డి భిక్షంరెడ్డి, మాజీ సర్పంచ్ బానోత్ పాండునాయక్, పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు కొత్త వీరన్న, మాజీ కౌన్సిలర్లు బోరగల్ల శరత్‌బాబు, కొండేటి హేమచంద్ర శేఖర్, నాయకులు కాలా యశోధర్ జైన్, కొత్త రాంబాబు, మారబోయిన రాంభద్రం, మంజుల చంటి, కందుల మధు, బాసిపంగు గోపి, గుగులోత్ రాము, పచ్చిపాల మల్లేశం, అజిత్మియా, దాసరి శ్రీను, గౌస్ తదితరులు పాల్గొన్నారు.