కాజీపేట జంక్షన్‌కు డివిజన్ హోదా కల్పించాలి
కాజీపేట జంక్షన్‌కు రైల్వేశాఖ డివిజన్ హోదా కల్పించాలని హనుమకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డి మాండ్ చేశారు.
- రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో భూనిర్వాసితులకు ఉపాధి కల్పించాలి
- విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్
మడికొండ, ఏప్రిల్ 4 : కాజీపేట జంక్షన్‌కు రైల్వేశాఖ డివిజన్ హోదా కల్పించాలని హనుమకొండ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. రైల్వే మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని డి మాండ్ చేశారు. శనివారం కాజీపేట మీడియా పా యింట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 9న మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి రైల్వే జీఎంకు సమస్యలపై వినతిపత్రం అందజేశామని, స్పందించిన చీఫ్ మెకానికల్ ఇంజినీర్ ఈ సమస్యల్లో కొన్నింటిపై లికితపూర్వకం గా వివరణ ఇచ్చారన్నారు.
ఇందులో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్(ఆర్ఎంయూ)ను ఆర్‌వీఎన్‌ఎల్‌కు అప్పగించినట్లు తెలిపారు. అందులో 75శాతం పనులు పూర్తి కాగా, మిగ తా పనులకు నాలుగు నెలల సమయం పడుతుందని చెప్పారన్నారు. రైల్వే బోర్డు ఈ కోచ్ ఫ్యాక్టరీని చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీతో కలిపి ఒక డీపీఆర్ తయారు చేయమని వారిని కోరగా, డీపీఆర్ వచ్చిన తర్వాత ఏడాది పాటు కోచ్ ఫ్యాక్టరీలోని అంశాలన్నీ పూర్తవుతాయని ఆయన పంపిన లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. కాజీపేట జంక్షన్‌ను డివిజన్ చేయాలని, పోరాడి సాధించుకున్న కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, చిరు వ్యాపారులకు సముదాయాలు కట్టించాలన్నారు.
కాజీపేట జంక్షన్ ఏర్పాటు, కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేట అభివృద్ధి కోసం కూడా 50 ఏళ్లనుంచి ఉద్యమం చేస్తున్నామని, గులాబీ సైనికులు ఉద్యమాలు చేస్తున్నారన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ప్రకటన చేసి, పంజాబ్‌కు తరలిస్తే బీఆర్ఎస్ నాయకులు ఉద్యమించారని, ఏపీ రీఆర్గనైజేషన్ కమిటీలో సైతం కేసీఆర్ ముందు చూపుతో ఈ కోచ్ ఫ్యాక్టరీని పొందుపర్చారనే విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల కేంద్ర రైల్వేశాఖ మంత్రిని కేటీఆర్ కలిసినప్పుడు కాజీపేట జంక్షన్‌ను డివిజన్ చేయాలని తెలుపగా మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. కానీ, రైల్వే జీఎం ఇటీవల మాట్లాడుతూ.. డివిజన్ అనే ప్రస్తావనే లేదని తెలపడం బాధాకరమన్నారు. కాజీపేట డివిజన్ స్థా యిగా ఏర్పాటు చేసే వరకూ పోరాడుతామని, రైల్వే పరిధిలో 1500 నుంచి 2000 కిలోమీటర్ల ట్రాక్‌కు ఒక డివిజన్ ఏర్పాటు చేయాలన్నారు.
కానీ సికింద్రాబాద్ చూస్తే 3,100 కిలోమీటర్లు ఉంద ని, ఇంత ఎకువగా ట్రాక్ ఉంటే అధికారులు, కార్మికులు ఎం తో మానసిక, శారీరక ఒత్తిడితో పని చేయా ల్సి ఉం టుందని ఆరోపించారు. దేశానికే కాజీపేట గుండె వంటిదని, సెంట్రల్ రైల్వేలో కాజీపేట జంక్షన్ నుంచే అధిక రాబడి వస్తుందని తెలిపారు. కాజీపేట డివిజన్ హోదా కల్పించే వరకు దశలవారీగా పోరా టం చేస్తామని హెచ్చరించారు. కోచ్ ఫ్యాక్టరీని వర్చువల్‌గా ప్రారంభిస్తామని ప్రధానమంత్రి తెలుపడాన్ని స్వాగతిస్తున్నామని, డివిజన్ చేయకున్నా, కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించకున్నా అడ్డుకుంటామన్నారు. సమావేశంలో కార్పొరేటర్ సంకు నర్సింగరావు, నాయకులు జోరిక రమేశ్, పాలడుగుల శివ, బెదరకోట రంజిత్‌కుమార్, సుంచు కృష్ణ, నార్లగిరి రమేశ్, సంకు నర్సింగరావు, బరిగెల వినయ్, షేక్ మహమూద్, పాము రాజేశ్, వేణు, నయీమ్ జుబేర్, వెంకట్, అఫ్జల్ పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavya & Anirudh | పెళ్లి పీటలెక్కబోతున్న కావ్యా మారన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. రెండు రోజుల్లోనే రూ.209 కోట్ల వసూళ్లు!
LK Advani: ఛాతిలో ఇన్ఫెక్షన్.. ఆస్పత్రిలో చేరిన అద్వానీ
Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థి
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

