గోపాల్పేట, ఏప్రిల్ 15 : తెలంగాణ ప్రజలకు గులాబీ జెండా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రజతోత్సవ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈనెల 27వ తేదీన వరంగల్‌లో నిర్వ హించనున్న రజతోత్సవ సన్నాహక సమావేశాన్ని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాలరాజు అధ్యక్షతన మంగళవారం వనపర్తి జిల్లా గోపాల్‌పేటలోని పద్మావతి గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ప్రయోజనాల కోసమే కేసీఆర్ పార్టీని స్థాపించారని తెలిపారు. నాటి నుంచి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిషలు పాటు పడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర సాధన కోసం పదువులను లెక్కచేయలేదని, చావుదాకా వెళ్లి తెలంగాణను సాధించినట్లు గుర్తు చేశారు. కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నిరంగాల్లో దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 27న ప్రతి గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని గులాబీ జెండా ఎగురవేసి సభకు బయలుదేరాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా వరంగల్ సభ ప్రచారం నిర్వహించాలని ఆయన కోరారు. సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, జిల్లా మీడియా కన్వీనర్ అశోక్, డీసీఎం ఎస్ వైస్ చైర్మన్ హర్యానాయక్, రైతుబంధు సమితి మాజీ మం డలాధ్యక్షుడు తిరుపతియాదవ్, మాజీ గ్రామ అధ్యక్షుడు మ న్యంనాయక్,
మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, జెన్కో రిటైర్డ్ ఎస్ఈ మందా తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, శేఖ ర్యాదవ్, వెంకటయ్య, శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు రాజేశ్‌గౌడ్, ఎండీ మతీన్, సునీల్, శేషి రెడ్డి, రవి, శ్రావణ్, నాగ రాజు, శరత్, కృష్ణారావు, రాజు, ఓంకార్, వెంకట య్యగౌడ్, రాం బాబు, మొగులయ్య, శ్రీని వాస్‌రెడ్డి, కాశీనాథ్, శేఖర్‌గౌడ్, శరత్ బాబు, సురేందర్, మనేశ్, శివకుమార్, మన్సూర్, రాములు, శివ కుమార్, మహేందర్ తదితరు లు పాల్గొన్నారు.