వర్ధన్నపేట/తొర్రూరు/దేవరుప్పుల, అక్టోబర్ 4 : ఎన్నికల మ్యానిఫెస్టో అమలు చేస్తేనే కాంగ్రె స్ ప్రభుత్వానికి ఓటడిగే హక్కు ఉందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుం డా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. శనివారం ఆయన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం లో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను ప్రజలు, కార్యకర్తలకు పంపిణీ చేశా రు.
అలాగే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం హరిపిరాల, వెలికట్టే గ్రామాల్లో ఎంపీటీసీ క్లస్టర్ సమావేశాలు నిర్వహించారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని తిరుమల గార్డెన్లో స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునేందుకు గత ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు ఇచ్చారన్నారు.
కానీ, అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. ప్రజలు, రైతు లు, యువకులు, మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తుండడంతో ఎప్పటికప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వాయి దా వేస్తూ వస్తున్నారని అన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపు పేరుతో ఎన్నికలు వాయిదా వేసి, చివరకు పనికిరాని జీవో తో ఎన్నికల బరిలో దిగారని అన్నారు.
ఎన్నికలు జరుగుతాయో.. లేదోనన్న సందిగ్ధంలో పార్టీలు, నాయకులు, ఆశావహులు ఉన్నట్లు తెలిపారు. ఎన్నికలు జరిగినా వాటిని రద్దుచేసే అధికారం న్యాయస్థానాలకు ఉండడంతో బరిలో ఉండాలంటే నాయకులు జంకుతున్నారన్నారు. ఎన్నికల ముందు కల్యాణలక్ష్మి లో తు లం బంగారం ఇస్తామంటే నమ్మి పెండ్లిళ్లు వాయిదా వేసుకున్న సందర్భాలున్నాయని, ఈ న్లైతే రూ.లక్ష, వచ్చే న్లైతే రూ.లక్షతో పాటు తులం బంగారం, ఈ న్లైతే పింఛన్ రూ.2వేలు, వచ్చే నెల తీసుకుంటే రూ. 4వేలంటూ ప్రచారం చేసి ప్రజలకు బుట్టలో వేసుకొని నిండా ముంచిన రేవంత్‌రెడ్డిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ బాకీ పడిందనే విషయాన్ని తెలియజేసేందకు ప్రత్యేకంగా కాంగ్రెస్ బాకీ కార్డులను తయారు చేయడం జరిగిందన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు విధానాలు, ఇబ్బందులను గుర్తించి రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్పేలా ప్రజలను చైతన్య పరచాలని దయాకర్‌రావు కోరారు. కాగా, మాజీ మంత్రి దయాకర్‌రావు ఆధ్వర్యంలో ఇల్లందలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునేందుకు యత్నించారు.
ఇల్లంద గ్రామంలో కార్డులను బీఆర్ఎస్ నేతలు పంపిణీ చేస్తున్నారనే విషయం తెలుసుకున్న ఎస్ఐ రాజు గ్రామానికి చేరుకొని అనుమతి లేకుండా కార్యక్రమం చేపట్టొద్దని సూచించారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలకు ప్రజలకు జవాబుదారీతనంతో ఉండాల్సిందిపోయి విపక్ష పార్టీ కార్యక్రమాలను అడ్డుకునేందుకు యత్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ నేతలు అన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి తన శిష్యుడే కానీ, బ్రోకర్ రాజకీయాలు ఆడుతున్నాడని అన్నారు. వర్ధన్నపేటలో మాజీ జడ్పీటీసీ మార్గం భిక్షపతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, దేవరుప్పులలో జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయక్, మండల నాయకులు పల్లా సుందరరాంరెడ్డి, తీగల దయాకర్, లింగాల రమేశ్‌రెడ్డి, బబ్బూరి శ్రీకాంత్‌గౌడ్,
బస్వ మల్లేశ్, మాజీ వైస్‌ఎంపీపీ కత్తుల విజయ్, మాజీ ఎంపీపీ కొల్లూరు సోమయ్య, రాంసింగ్, చింత రవి, కోతి ప్రవీణ్, యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం రాజు, మండల యూత్ అధ్యక్షుడు బానోతు నవీన్, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు మాచర్ల బాబు, బస్వ వెంకన్న, తొర్రూరులో మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మాజీ జడ్పీటీసీ మంగళపెల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, పట్టణ వరిం గ్ ప్రెసిడెంట్ అనుమాండ్ల ప్రదీప్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నలమాస ప్రమోద్, పట్టణ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.