జయశంకర్ భూపాలపల్లి, జూలై 7 (నమస్తే తెలంగాణ) : దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వర ముక్తీశ్వర ఆలయాన్ని దుద్దిళ్ల కుటుంబం అపవిత్రం చేస్తున్నదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోనీ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండు రోజుల క్రితం కాటారం మండలం ధన్వాడలో జరిగిన ఎల్లమ్మ గుడి ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చీరలు పంపిణీ చేశారని, అవి 2025 పుషరాలకు సంబంధించినవని, అవి ఇకడ ఎలా పంచారని ప్రశ్నించారు.
కాళేశ్వర ముక్తీశ్వర ఆలయాన్ని శైలజారామయ్యర్ పూర్తిగా అవినీతి పాలు చేశారని మండిపడ్డారు. తన భర్త రాజకీయాల కోసం ఆలయ సొమ్మును అక్రమంగా వాడుకుంటున్నారన్నారు. శైలజా రామమ్యర్, దుద్దిళ్ల బ్రదర్స్ అందినకాడికి దోచుకుతింటున్నారని, దానికి సాక్ష్యం ధన్వాడలో పంపిణీ చేసిన చిరలేనన్నారు. 2025 పుషరాల్లో ఆలయం నుంచి డబ్బులు వెచ్చించి కొనుగోలు చేసిన చీరల్లో 50వేల చీరలు, ప్రసాదం దొంగిలించారని, వచ్చే పుషరాల్లో లక్ష కిట్లను సైతం దొంగిలించేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. దొంగతనంగా తీసుకొచ్చిన చీరలు ఆడబిడ్డలకు ఇచ్చి ఎల్లమ్మ గుడిని సైతం అపవిత్రం చేశారని మండిపడ్డారు.
ఆలయానికి సంబంధించిన డబ్బులతో ఏం ఖర్చు చేశారని సమాచార హక్కుచట్టంలో తానే స్వయంగా అడిగితే సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం బయటకు చెప్పవద్దని శైలజారామయ్యరు సమాధానం ఇచ్చారన్నారు. ఆలయానికి సంబంధించిన భూములు, డబ్బులు, నగలు, బంగారంలాంటి వివరాలు ఇవ్వొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉంది, కానీ, ఖర్చులను చెప్పవద్దని ఎకడా లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అడ్డుపెట్టుకుని దుద్దిళ్ల కుటుంబం కోట్ల రూపాయలు దోచుకుతింటున్నదన్నారు. ఆలయం అపవిత్రమైతే యావత్తు తెలంగాణకు మచ్చ వచ్చినట్లేనన్నారు.
పుషరాలకు సంబంధించిన చీరల సంచులు బయటకు ఎలా వచ్చాయో, మంత్రి శ్రీధర్‌బాబు ఎందుకు ఇచ్చారో శైలజారామయ్యర్ మంథని ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పుషరాల్లో గంగాహారతి ఇచ్చేందుకు లక్షల డబ్బులు వెచ్చించి పురోహితులను పిలిపించారని, ఇకడ పురోహితులు లేరా..? అన్ని ప్రశ్నించారు. మంథనిలో వేదపండితులను వదిలి, వేరే ప్రాంతం నుంచి తీసుకురావడం కమీషన్ల కోసమేనని విమర్శించారు. పుషరాలు సమీపిస్తున్న క్రమంలో మంత్రి ఆలయాన్ని కూల్చివేస్తామంటున్నాడు, సీఎం పైసలు లేవంటున్నాడు. ఇందులో ఆంతర్యమేమిటో తెలుపాలన్నారు.
వచ్చే ఎన్నికల్లో ఓటుకు రూ.5వేలు ఇస్తామనే సంక్పలంతో దుద్దిళ్ల కుటుంబం ఎకడ పడితే అకడ దోపిడీకి పాల్పడుతున్నదని, పవిత్రమైన ఆలయాన్ని అపవిత్రం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కటకం జనార్దన్, లింగంపల్లి శ్రీనివాసరావు, జోడు శ్రీనివాస్, మార రాముగౌడ్, కుంభం రాఘవరెడ్డి, గోనె శ్రీనివాస్ రావు, శ్రీపతి బాపు, ఆనరి ప్రకాశ్, కేదారి గీతా, కౌన్సిలర్లు మోతె రాజు, బొంతల సతీశ్, కట్ల పూర్ణ చందర్, వాసాల స్వప్న, జ్యోతుల మంజులా వెంకన్న, రత్నం సుమంజలీ అవినాశ్, తిరుతమ్మ, హరీశ్ రెడ్డి పాల్గొన్నారు.