రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు నియోజకవర్గంలో వేరు కుంపటి రాజకీయం జోరందుకున్నది. మంత్రి అనుంగ అనుచరుడు నల్గొండ రమేశ్ ఇంట్లో శుక్రవారం నిర్వహించిన బ్రేక్ ఫాస్ట్ సమావేశం చర్చనీయాంశంగా మారింది. సీని యర్లకు అన్యాయం జరుగుతుందని మండిపడింది. కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుమారు వంద మందికిపైగా పాల్గొన్న భేటీ హాట్‌హాట్‌గా జరిగింది. కొత్తగా పుట్టుకొచ్చిన నేత ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్న ఆగడాలు, సొంత పార్టీ నాయకులపైనే అక్రమ కేసులు పెట్టించి వేధించడంపై సీనియర్లు భగ్గుమన్నారు. ఇక భరించలేమని, తాడో పేడో తేల్చుకునేందుకు శపథం చేశారు.
– వరంగల్, డిసెంబర్ 12
కొండా దంపతుల ప్రధాన అనుచరుడిగా పేరు న్న నల్గొండ రమేశ్‌ను పక్కన పెట్టడంతో ఆయ న వేరుకుంపటి పెట్టినట్లు తెలుస్తోంది. పార్టీలో సీనియర్ నాయకులు, కార్యకర్తలను ఏకం చేసి సమావేశం నిర్వహించారు. మంత్రి సురేఖ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పార్టీలు మారి ఎన్నికల ముందు పార్టీలో చేరిన నాయకుడికి ప్రాధాన్యం ఇవ్వడంపై పార్టీ లో అసంతృప్తికి కారణంగా కనిపిస్తోంది.
చక్రం తిప్పుతున్న బస్వరాజ్
ప్రస్తుతం తూర్పు కాంగ్రెస్‌లో కొండా వర్సెస్ బస్వరాజ్ అన్నట్లుగా రాజకీయం మారింది. కొ న్ని నెలలుగా కిత్రం పోచమ్మమైదాన్ సెంటర్లో డబ్బాల తొలగింపు వివాదంలో కొండా మురళి బాహాటంగానే సారయ్యపై సవాల్ చేశారు. అప్ప టి నుంచి మంత్రి, ఎమ్మెల్సీలు వేర్వేరుగా కుంప ట్లు పెడుతున్నారు. తాజాగా జరిగిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశం పేరుతో సారయ్య చక్రం తిప్పుతున్నారనే ప్రచారం సాగుతోంది. మంత్రి సురేఖను ఒంటరి చేయాలన్న లక్ష్యంతో ఆయన పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇటీవల జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన అయూబ్ సారయ్యతో కలిసి పనిచేస్తుండగా, అసంతృప్తి నేతలు, కార్యకర్తలను ఆయన చేరదీస్తున్నారు.
ప్రధాన అనుచరుడి వేధింపులపై ఆవేదన
ఇటీవల 25వ డివిజన్ మైనార్టీ నాయకుడు ఆవేదనతో సోషల్ మీడియాలో పెట్టిన వాయిస్ రికార్డ్ వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. రెం డు రోజుల క్రితం సదరు నాయకుడిపై ప్రధాన అనుచరుడు చేయించిన దాడిపై నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన వేధింపులు ఎక్కువవుతున్నాయని ఏకరువు పెట్టారు. దీంతో పాటు పార్టీ కోసం పనిచేసిన సీనియర్లకు పదవులు దక్క డం లేదని, అన్ని ప్రధాన అనుచరుడి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని సీనియర్లు ఆవేదన వ్య క్తం చేసినట్లు తెలిసింది. అతడి వేధింపులు భరించలేమని ఇక తాడోపేడో తేల్చుకోనేందుకు సిద్ధమవుతున్నారు. కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో న్యాయం చేయాలని సీనియర్లు కోరారు. డివిజన్ల వారీగా కమిటీలు వేయాలని, సీనియర్లు, మొదటి నుంచీ పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యత కల్పించాలని సూచించారు. అధిష్టానానికి మంత్రి సురేఖ తీరుపై మరోసారి ఫిర్యాదు చేసేందుకు తూర్పు నేతలు సిద్ధమవుతున్నారు.
మంత్రి కొండా అనుచరుడిపై కేసు
వరంగల్‌చౌరస్తా, డిసెంబర్12 : మంత్రి కొండా సురేఖ ప్రధాన అనుచరుడు గోపాల నవీన్రాజ్పై స్థానిక ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్వామి భక్తిని చాటుకోవడానికి పోలీసులు ఈ విషయాన్ని దాచగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంత్రి తమ ముఖ్య అనుచరుడి మాటలను నమ్మి పార్టీని నమ్ముకున్న వారిని, గెలిపించడానికి పనిచేసిన వారిని ప ట్టించుకోవడం లేదంటూ 25వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ సాజిద్ అహ్మద్ బుధవా రం వాట్సాప్ గ్రూప్‌లో వాయిస్ పోస్ట్ చేశాడు. దీంతో ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన ఎస్కే అఫ్జల్ తనను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మద్యం తాగించి తనపై కర్రతో దాడి చేసి బెదిరించి మంత్రి అనుచరుడిని తప్పుబట్టిన విషయంలో తనదే తప్పు అన్నట్లుగా వాయిస్ రికార్డు చేసి వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాడని సాజిద్ అహ్మద్ తెలిపాడు.
దీంతో పాటు వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని స్థానిక ఇంతేజార్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దాడి చేసిన నిందితు డితో పాటుగా అనుమానితుడిగా మంత్రి అనుచరుడిని చేర్చి భారత శిక్షాస్ముృతి 118(1), 296(బీ), 351(2) సెక్షన్లను అనుసరించి 491/2025(ఎఫ్ఐఆర్) నమోదు చేశారు. కాగా, సాజిద్ అహ్మద్‌పై జరిగిన దాడి సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కాంగ్రెస్ జిల్లా నాయకులు కలుగజేసుకొని పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన ఇంతేజార్గంజ్ పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ మీడియాకు విషయం తెలియనీయకుండా జాగ్రత్తలు పాటించారు. ఈ విషయం శుక్రవారం బయటకు పొక్కడంతో బొక్కబోర్లాపడ్డారు.