భీమదేవరపల్లి, ఆగస్టు 26 : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూరు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం క్షయ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ వైద్యాధికారి ప్రదీప్ రెడ్డి ఆహార కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వైద్యాధికారి అల్లెం అప్పయ్య, క్షయ నివారణ అధికారిణి హిమబిందు చొరవతో హనుమకొండ జిల్లాలోని కొన్ని ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాల సహకారంతో క్షయ వ్యాధిగ్రస్తులకు ఈ కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
క్షయ వ్యాధిగ్రస్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది మల్లీశ్వరి, జ్యోతి, రాజయ్య, రత్న భారతి, రాజు, సురేందర్, మహేందర్, వనజ, సత్యవేద తదితరులు పాల్గొన్నారు.