వరంగల్ చౌర స్తా, జూలై 27: సాధారణ బదిలీల్లో భాగంగా ఎంజీఎం దవాఖానలో పాలనాధికారి బదిలీ అ య్యారు. ఈ నేపథ్యంలో ఎంజీఎం ఔట్ పేషెంట్ల విభాగానికి చేరుకునే ప్రధాన రెండో, మూడో నంబరు గేట్లకు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ‘శాడిస్ట్ అయిన పాలనాధికారి ఎంజీఎం నుంచి బదిలీ అయినందుకు ఎంజీఎంకు పట్టిన పీడ విరగడైంది. హాస్పిటల్ సిబ్బంది ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటున్నాం’ అంటూ సిబ్బంది పేరుతో రా యించిన ఫ్లెక్సీని గుర్తుతెలియ ని వ్యక్తులు కట్టారు.
ఈ మేర కు సిబ్బంది స్వీట్లు పంపిణీ చే సుకున్నారు. శనివారం విష యం తెలుసుకున్న వైద్యాధికారులు శానిటేషన్ సిబ్బందితో బ్యానర్లను తొలగింపజేశారు. ఈ విషయమై ఎంజీఎంలో భిన్నస్వరాలు వినివస్తున్నాయి. అధికారి ఉద్యోగులను ఇంత ఇబ్బంది పెట్టారా అని కొందరు, నిబంధనలు పక్కాగా పాటిస్తే ఇలా చేస్తారా.. అని మరికొందరు పెదవి విరుస్తున్నారు.