మన ఆడబిడ్డలకు రాష్ట్రస్ధాయి పురస్యారాలు
వివిధ కళల్లో ప్రతిభ చూపుతున్న ఆడబిడ్డలను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. రాష్ట్రంలో మొత్తం 19 మంది రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారాలు అందుకోగా వీరిలో ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు మహిళలున్నారు.
- బోనాలు, కోలాటం కళలో రాములమ్మ, నీలమ్మ
- జానపద నృత్యంలో భాగ్య.. డప్పు వాయిద్యంలో సారమ్మ.. ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా రాణి
స్టేషన్‌ఘన్‌పూర్/లింగాలఘణపురం/ మహబూబాబాద్ రూరల్/హసన్‌పర్తి, మార్చి 14 : వివిధ కళల్లో ప్రతిభ చూపుతున్న ఆడబిడ్డలను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. రాష్ట్రంలో మొత్తం 19 మంది రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారాలు అందుకోగా వీరిలో ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు మహిళలున్నారు.
బోనాలు, కోలాటం కళలో జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్ల నుంచి బండి రాములమ్మ, గొరిగె నీలమ్మ, జానపద నృత్యంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గొల్లగూడేనికి చెందిన దయ్యాల భాగ్య, డప్పు వాయిద్యంలో హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ముచ్చర్లకు చెందిన మట్టెడ సారమ్మ, ఉత్తమ అంగన్వాడీ టీచర్‌గా జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన మునిగాల రాణి గురువారం హైదరాబాద్‌లో అవార్డులు అందుకున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా నుంచి ఐదుగురు మహిళలు రాష్ట్ర స్థాయి ఉత్తమ అవారులు అందుకున్నారు. నెల్లుట్లకు చెందిన బండి రాములమ్మ, గొరిగె నీలమ్మ బోనాలు, కోలాట నృత్య ప్రదర్శనలతో గుర్తింపు పొందగా వారి ప్రతిభకు అవార్డులు దాసోహమయ్యాయి. వీరికి రూ.లక్ష చొప్పున నగదు పురస్కారాన్ని మంత్రి దనసరి అనసూయ (సీతక్క), అధికారులు అందజేశారు.
వీరికి పురస్కారం రావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశా రు. గూడూరు మండలం గొల్లగూడేనికి చెందిన దయ్యాల భాగ్యకు పుట్టుకతోనే కాలు లేదు. అయి నా ఆమె మొక్కవోని ఆత్మస్థయిర్యంతో ముందుకెళ్తున్నది. ప్రస్తుతం తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్ చేస్తున్నది. మరోవైపు నాట్యాన్ని ప్రాణంగా ప్రేమించి నైపుణ్యం సాధించింది ఒంటికాలితోనే నృత్యం చేస్తూ అలరిస్తుంది. ఆమె ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ పురస్కారాన్ని అందించింది. హసన్‌పర్తి మండ లం ముచ్చర్లకు చెందిన మట్టెడ సారమ్మ డప్పు వాయి ద్య కళాకారిణి.
మండలంలోని చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 200 మందికిపైగా యువకులకు ఆమె డప్పు వాయిద్యం నేర్పింది. ఈమె నైపుణ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం అవార్డును అందించింది. స్టేషన్‌ఘన్‌పూర్‌లోని అంగన్వాడీ సెంటర్-6లో విధు లు నిర్వర్తిస్తున్న మునిగాల రాణికి ఉతమ్మ పురస్కారం దక్కింది. సెంటర్లోని పిల్లలు, గర్భిణులు, బాలింతలకు వంద శాతం పౌష్టికాహారం అందించడం, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడం, ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగం గా గృహ సందర్శన చేయడం, దశాబ్ది ఉత్సవాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శించడం, బీఎల్వోగా ఎన్నికల విధుల్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నది. ఆమె రెండోసారి అవార్డు అందుకోవడం పై సీడీపీవో ఫ్లోరెన్స్, ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు హర్షం వ్యక్తంవ్యక్తం చేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

