నర్సంపేట, మార్చి13: ఇటీవల వరంగల్‌లో యువ వైద్యుడు సుమంత్ రెడ్డిని సుపారి ఇచ్చి భార్య హత్య చేయించిన ఘటన మరువక ముందే నర్సంపేట మండలం ఆకులతండాలో మరో డీల్ వెలుగు చూసింది. రూ.10 లక్షలు ఇస్తానని, తన భర్తను చంపేయాలని ఒప్పందం కుదుర్చుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ధరావత్ సుమన్‌కు ఇదే మండలం మహేశ్వరం తండాకు చెందిన భూక్యా మంజులతో 2018లో వివాహం జరిగింది. వీరి ఒక పాప కూడా ఉంది.
సుమన్ హైదరాబాద్‌లోని ఓ బ్యాంక్‌లో పీవో గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మూడేళ్లుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నా యి. ఈక్రమంలో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీలు జరిగాయి. ఇదే అక్క సు పెంచుకున్న భార్య ఎలాగైనా భర్త సుమన్‌ను వదిలించుకోవాలని చూసింది. మంజుల బావ, సమీప బంధువైన మహేశ్వరం గ్రామానికి చెందిన మోతీలాల్ సహాయంతో ముఠా సభ్యులను కలిసి సుపారీకి ఆఫర్ చేసింది. రాయపర్తి మండలానికి చెందిన బానోత్ నరేశ్, తొర్రూరు మండలానికి చెందిన మల్లేశ్, ఆకులతండాకు చెందిన మూడు గోపితో మంజుల తన భర్తను చంపేందుకు రూ.10 లక్షల డీల్ మాట్లాడుకుంది. హోలీ పండుగ తర్వాత సుమన్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు.
ఇదిలా ఉండగా కొన్ని రోజు ల కిందట సుమన్‌కు నరేశ్ ఫోన్ చేసి రూ.3 లక్షలు ఇస్తే నీకు అతి విలువైన స మాచారం ఇస్తానని చెప్పాడు. మొదట్లో ఆ విషయాన్ని అంతగా పట్టించుకోని సుమన్ రెండు రోజుల క్రితం స్థానిక పోలీ స్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు నరేశ్ ఫోన్‌ను ట్రాప్ చేసి విచారణ చేపట్టడంతో అసలు విషయం బయట ప డింది. మంజుల తన భర్త హత్య కోసం రూ.10 లక్షల డీల్ ఒప్పుకున్నట్లు విచారణలో తే లింది. ఇందులో భాగంగా ఒక్కొక్క ముఠా సభ్యుడికి రూ.30 వేల చొప్పున ముగ్గురికి అడ్వాన్స్ పేమెంట్ కూడా ముట్టజెప్పినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. దీంతో మంజు ల, మోతీలాల్, నరేశ్, మల్లేశ్, గోపిలను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై అరుణ్‌కుమార్ తెలిపారు.