కాజీపేట/ఆత్మకూరు, ఏప్రిల్ 5: వేర్వేరు చోట్ల ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ చేస్తున్న ఐదుగురిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కాజీపేట లో నలుగురు, ఆత్మకూరు ఒకరిని అదుపులోకి తీసుకోగా ఇద్దరు పరారీలో ఉన్నా రు. టాస్క్‌ఫోర్స్ సీఐ బాబులాల్ తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట పట్టణ పరిధిలో వివిధ ప్రాంతాలకు చెందిన కొంతమంది ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ పెట్టి ఆ డుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ బృందానికి స మాచారం అందింది.
టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆదేశాల మేరకు దాడులు చే సి గొడుగు శ్రీనివాస్, గొడుగు రమేశ్, సముద్రాల శ్రీనివాస్, బోకరి సంతోష్‌లను అదుపులోకి తీసుకొ ని వారి నుంచి రూ.20వేల నగదు, నాలుగు స్మార్ట్ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం కాజీపేట పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు తెలిపారు. అలాగే ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్న ముక్కల రాజును శనివారం అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ తెలిపారు. మరో ఇద్దరు నల్గొండ జిల్లాకు చెందిన మర్రి సుధీర్‌కుమార్, మర్రి సురేశ్ పరారైనట్లు ఆయన తెలిపారు. రాజు నుంచి రూ. 42,100, స్మార్ట్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణ కోసం నిందితుడిని ఆత్మకూరు పోలీసులకు అప్పగించారు. పట్టుకున్న వారిలో ఎస్సై శ్రీధర్, కానిస్టేబుల్స్ ఉన్నారు.