చెన్నారావుపేట : మత్స్యకారులు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెన్నారావుపేట వరంగల్ జిల్లా మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు హంస విజయరామరాజు అన్నారు. శుక్రవారం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా చెన్నారావుపేట మండల కేంద్రంలో ముదిరాజ్ కులస్తులు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ముదిరాజ్లు అందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని తెలిపారు.
మత్స్యకారుల సంక్షేమం మత్స్య పరిశ్రమ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నుండి వచ్చే రాయితీలు పొందేలా పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. అలాగే మత్స్యకారులకు తగిన ప్రోత్సాహం అందించి వారి అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చెన్నారావుపేట మండల మత్స్యకార సంఘం అధ్యక్షులు చింతకాయల నరేందర్, వరంగంటి సంతోష్, హంస మహేందర్, హంస విజేందర్, సాంబయ్య, ముత్యం రాజు, హంస భద్రయ్య, వీరభద్రయ్య లక్కరాజు తదితరులు పాల్గొన్నారు.