కేసముద్రం, ఆగస్టు 8: కేసముద్రం రైల్వే స్టేషన్లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత షార్ట్‌సర్క్యూట్‌తో క్యాంపింగ్ కోచ్ రైలు దగ్ధమైంది. వివరాల్లోకి వెళితే.. కేసముద్రంలో రైల్వేస్టేషన్లో 3వ లైన్‌తోపాటు లూప్‌లైన్ ని ర్మాణ పనులు చేపడుతున్నారు. పనులు చేసిన తర్వాత రాత్రి సమయంలో సిబ్బంది పడుకునేందుకు క్యాంపింగ్ కోచ్ (రెస్టు కోచ్) బోగిని ఉపయోగిస్తారు. ఈ బోగిలో సిబ్బందికి కావాల్సిన పనిముట్లు, యంత్రాల్లో ఉపయోగించే ఆయిల్‌ను అందుబాటులో ఉంచుకుంటారు. ఫ్యాన్ లు, ఏసీలు పని చేయడానికి పక్కనే ఉన్న రైల్వే క్వార్టర్స్ నుంచి విద్యుత్‌ను సర్వీస్ తీగ ద్వారా తీసుకుంటారు. లూ బ్ లైన్లో ఉన్న క్యాంపింగ్ కోచ్‌కు విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేయగా పనులు పూర్తిచేసి నలుగురు సిబ్బంది పడుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత షార్ట్ సర్క్యూట్‌తో బోగి నుంచి మంటలు వ్యాపించడంతో రైల్వే ఉద్యోగులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.
కోచ్‌లోని సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించి చాకచక్యంగా బయటకు వచ్చి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. పనుల నిర్వహణకు వినియోగించే యంత్రాల్లో పోయడానికి 8 డ్రమ్ముల్లో ఆయిల్‌ను బోగీలో నిల్వ చేశారు. మంటలు వ్యాపించినప్పటికీ బోగీలో ఉన్న ఆయిల్ డ్ర మ్ములకు ఎలాంటి నష్టం జరగలేదు. రెండు అగ్నిమాపక యంత్రాలు, సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తె చ్చారు. కొంత మేరకు నష్టం తగ్గినట్లు అంచనా వేస్తున్నా రు. విషయం తెలుసుకున్న పోలీసులు శుక్రవారం ఘట నా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
క్యాంపింగ్ కోచ్‌లో ఎలా మంటలు వ్యాపించాయనే అంశంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టేందుకు సెక్యూరిటీ, ఇంజినీరింగ్, ఆపరేటింగ్ శాఖల అధికారులతో కమిటీ వేసినట్లు తెలిసింది. అయితే కొన్ని సంవత్సరాల క్రితం వరంగల్ నుంచి డోర్నకల్ వైపునకు వెళ్తున్న గౌతమి ఎక్స్‌ప్రెస్ రైలులోనూ ప్రమాదవశాత్తు మంటలువ్యాపించి కొన్ని బోగీలు దగ్ధమైన విషయం తెలిసిందే. గౌతమి ఎక్స్‌ప్రెస్ బోగీలు దగ్ధమైన ఘటనలో కొంతమంది ప్రయాణికులు ప్రాణాలను సైతం కోల్పోయారు. మరోసారి కేసముద్రంలోను రైలు బోగి దగ్ధమవడం చర్చనీయంగా మారింది.