సర్కారు బడుల్లో ఉదయం వేళ విద్యార్థుల ఆకలి తీర్చేందుకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా 2022-23 విద్యా సంవత్సరంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభు త్వం రాగి జావ పంపిణీ చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఈ విద్యాసంవత్సరం దీన్ని అటకె క్కించింది. స్కూళ్లు తెరిచి నెల గడుస్తున్నా ప్రారంభించక లక్ష్యాన్ని నీరుగార్చింది. పొద్దున్నే అల్పాహారం తీసుకోకుండానే విద్యార్థులు పాఠశాలలకు వచ్చి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పస్తులు ఉండాల్సి వస్తున్నది. – నెల్లికుదురు, జూలై 13
రక్తహీనత, పోషకాహార లోపం తలెత్తకుండా ఉం డేందుకు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కు ఓ ట్రస్ట్ ద్వారా 2022-23 విద్యా సంవత్సరం నుంచి రాగి జా వను ఉచితంగా సరఫరా చేస్తున్నది. రాగిమాల్ట్ పొడిని ట్రస్ట్ వాళ్లు మండల విద్యాశాఖ కార్యాలయానికి పంపిస్తే అక్కడి నుంచి పాఠశాలలకు సనఫరా చేస్తారు. రాగిజావ, బెల్లం పొడిని వేడినీటిలో కలిపి మిశ్ర మాన్ని గ్లాసుల్లో పోసి విద్యార్థులకు అందిస్తుంటారు. ప్రస్తుతం రాగిజావ పంపిణీ నిలిచిపోయింది. పాఠశాలలు ప్రారంభమై నెల గడుస్తున్నా నేటికీ అందించడం లేదు. చాలా మంది విద్యార్థులు ఉదయం పూట ఏం తినకుండానే స్కూళ్లకు వస్తుంటారు. విద్యార్థులు మధ్యాహ్న భోజన సమ యం వరకు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంటుందని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.
రాగిజావ పంపిణీ ఇలా..
ప్రతి విద్యార్థికి 10 గ్రాముల రాగిపొడి అదే స్థాయిలో బెల్లం పొడిని కలిపిన మిశ్రమాన్ని ఇస్తుం టారు. విద్యార్థులకు కోడిగుడ్డు ఇవ్వని రోజుల్లో దీన్ని ఇస్తారు. నిబంధనల ప్రకారం సోమ, బుధ, శుక్రవారాల్లో భోజనంలో కోడిగుడ్డు, మంగళ, గురు, శనివారాల్లో రాగిజావ పెట్టాలి. ఐరన్, సూక్ష్మ పోషకాలతో కూడిన పోషకాహారాన్ని అందజేయడంలో భాగంగా సర్కారు బడుల్లో విద్యార్థులకు రాగిజావను అందజేస్తున్నారు. బడులు ప్రారంభానికి ముందే సరఫరా కావా ల్సి ఉన్నా నేటికీ పంపిణీ ప్రారంభం కాలేదు. విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11 గంటల మధ్యలో అందాల్సిన రాగిజావ పంపిణీ చేయకపోవడంతో తమ పిల్లలు ఇబ్బందులు పడుతు న్నారని వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రాగిజావను విదార్థులకు అందించాలని కోరుతున్నారు.