మహబూబాబాద్, నవంబర్10 (నమస్తే తెలంగాణ) : ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి వసూలు రాజాగా మారా డు. కొన్నేళ్లుగా ఇకడే తిష్ట వేసి ప్రతి ఫైలుకు ఒక రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నాడు. తహసీల్దార్ కార్యాలయంలో అఫ్రూవల్ చేసి న ఫైల్స్ అన్ని ఆర్డీ వో లాగిన్‌కు వస్తాయి. ఆ ఫైళ్లను ప్రింట్ తీసి ఆర్డీవోకు ఫైల్ పెట్టాలి. ఆర్డీవో పరిశీలన అనంతరం లాగిన్‌లో అఫ్రూవల్ చేస్తే నేరుగా కలెక్టర్ లాగిన్‌కు వెళ్తాయి. తహసీల్దార్ కార్యాలయం నుంచి వచ్చిన దరఖాస్తులను నెలల తరబడి పెండింగ్‌లో ఉంచ డం వల్ల ఆర్డీవో కార్యాలయానికి రైతులు చెప్పులరిగేలా తిరుగుతున్నారు.
జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన గంగా రం, కొత్తగూడ, గూడూరు, బయ్యారం, గార్ల మండలాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నది. షెడ్యూల్డ్ ఏరియాలో భూమిని కొనుగోలు చేసిన గిరిజనులు ఫామ్-కే డిక్లరేషన్‌ను ఇస్తూ సదరు భూమి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటాడు. దీనిపై సంబంధిత తహసీల్దార్ సమగ్ర విచారణ చేసి ఆర్డీవోకు సిఫారసు చేస్తాడు. ఇకడే అసలు తతంగం మొదలవుతుంది. ఆర్డీవో కార్యాలయంలో అఫ్రూవల్ కావాలంటే కాసులు చెల్లించక తప్పదు. నెలలు తరబడి రైతులు తిరిగినా ఇకడ పని కాదు. దీంతో రైతులు ఆర్డీవో కార్యాలయం బాట పడుతారు. అకడ నుంచి ఇక సెటిల్మెంట్ల పర్వం మొదలవుతుంది.
ఆర్టీవో కార్యాలయంలో అఫ్రూవల్ చేసి, కలెక్టర్ ఉత్తర్వులకు నివేదిస్తాడు. కలెక్టర్ తహసీ ల్దార్, ఆర్డీవో సిఫారసులను ఆమోదించి ఫామ్-ఎల్ సర్టిఫికెట్ జారీ చేస్తాడు. దాని ఆధారంగా, ఆ భూమి వ్యవసాయ భూమి అయితే తహసీల్దార్, వ్యవసాయేతర భూమి అయితే సబ్ రిజి స్ట్రార్ రైతులకు రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఏజెన్సీ మండలాలను నుంచి ఇలా దరఖాస్తులు చేసుకున్న రైతులు చాలా మంది ఉన్నారు. అవన్నీ పెండింగ్ లో ఉన్నా యి. అఫ్రూవల్ చేసి పంపించడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆర్డీవో కార్యాలయంలో ప్రతి ఫైలుకు డబ్బులు వ సూలు చేస్తున్నారన్న సంగతి ఇల్లందు ఎమ్మె ల్యే కోరం కనకయ్య దృష్టికి వెళ్లింది. ఒక గిరిజన రైతు ఫాం-కే ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు. అందుకు ఆర్డీవో కార్యాలయంలో సదరు ఉద్యోగి రూ. 25 వేలు ఇవ్వాలని డి మాండ్ చేశాడు. ఇదేందని రైతు అడిగుతే ఆర్డీవోకు డబ్బులు ఇవ్వనిదే పని కాదని చెప్పా డు.దీంతో దికుతోచని ఆ రైతు గత నెలలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే ఇటీవల బదిలీపై వెళ్లిన ఆర్డీవోకు ఫోన్ చేసి సీరియస్ అయ్యారు. గిరిజన రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తారా.. అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒక ఎమ్మెల్యే ఆర్డీవోకు ఫోన్ చేసి అవినీతి జరుగుతుందని చెప్పే వరకు నిత్యం కార్యాలయంలో ఉండే అధికారికి తెలియకపోవడం ఏమిటని రైతులు ఆశ్చర్యపోతున్నారు. ఎమ్మెల్యే ఫోన్ చేసి చెప్పే వరకు వచ్చిందంటే రైతుల పరిస్థితి ఏవిధం గా ఉందో అర్థం చేసుకోవచ్చు.