పొలాల్లో నెర్రెలు.. అన్నదాతల్లో దిగులు
వానలు లేక.. కాల్వలకు నీరు విడుదల చేయక.. పొలాలు నెర్రెలు బారుతున్నాయి. బోర్లు వట్టిపోతున్నాయి. ఫలితంగా చే న్లు ఎండిపోతుండడంతో అన్నదాతలు దిగులు చెందుతున్నారు. బోర్లలో కొద్దోగొప్పో నీరున్నా కరెంట్ కోతలతో తిండిగింజలూ పండే పరిస్థితి లేదని వాపోతున్నారు.
- వట్టిబోతున్న బోర్లు.. ఎండుతున్న పొలాలు
- కొద్దోగొప్పో నీరున్నా కరెంట్ కట్‌తో అవస్థలు
- అటు కాల్వలకు నీరు రాక.. ఇటు వానలు పడక
- తిండిగింజలూ అందే పరిస్థితి లేదని రైతుల ఆందోళన
వర్ధన్నపేట/దేవరుప్పుల/నర్సింహులపేట/పాలకుర్తి, ఆగస్టు 21 : వానలు లేక.. కాల్వలకు నీరు విడుదల చేయక.. పొలాలు నెర్రెలు బారుతున్నాయి. బోర్లు వట్టిపోతున్నాయి. ఫలితంగా చే న్లు ఎండిపోతుండడంతో అన్నదాతలు దిగులు చెందుతున్నారు. బోర్లలో కొద్దోగొప్పో నీరున్నా కరెంట్ కోతలతో తిండిగింజలూ పండే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో సాధారణ వర్షపాతంలో సగం కూడా నమోదు కాలేదు.
దీంతో చెరువులు, కుంటల్లోకి నీరు చేరలేదు. రైతులు మాత్రం జూలై రెండో, మూడో వారంలో కురిసిన కొద్దిపాటి వర్షానికే పంటలు సాగు చేశారు. అప్ప టి నుంచి వర్షాలు కురవక.. కాంగ్రెస్ సర్కారు ఎస్సారెస్పీ, దేవాదుల ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పంట లు ఎండిపోతున్నాయి. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోతుంటే అ న్నదాత కన్నీరు పెడుతున్నాడు. కొందరు బోర్లపైన ఆధారపడి సాగు చేస్తున్నా కరెంట్ కోతలతో సాగు నీటి కోసం అవస్థలు పడుతున్నారు.
కేసీఆర్ సారే దేవుడు..
వానలు కురిసినా.. కురవకపోయినా కేసీఆర్ సార్ కాల్వల ద్వారా నీటిని విడుదల చేయడం వల్ల చెరువులు నిండి ఏటా రెండు పంటలు పండించుకున్నం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నంక రెండేళ్ల నుంచి చెరువులకు చుక్కనీరు రాలే. ఇప్పుడు ఎస్సారెస్పీ, దేవాదుల కాల్వల్లో చెట్లు మొలిచే పరిస్థితి వచ్చింది. సర్కారు వెంటనే నీటిని విడుదల చేయకుంటే రైతుల ఆగ్రహానికి గురైతది.
– నాంపెల్లి వెకన్న, రైతు, ఇల్లంద
సగం పొలమే నాటు పెట్టిన
మా అన్నదమ్ముల పొత్తుల ఐదెకరాల భూమి ఉంటే కరువును ముందే ఊహించి తిండి మం దమన్న పండిద్దామని 3 ఎకరాలే వరి నాటు పెట్టినం. రెండు బోర్లు ఉన్నయ్. ఒకటి మొత్తమే ఎండింది. ఇంకోటి ఆగిఆగి పోస్తుంది. మూడెకరాలల్ల రెండు ఎకరాల వరకు చేను నెర్రబారింది. ఇంకో వారం రోజులు ఇదే పరిస్థితి ఉంటే ఉన్న కాడికి ఎండుతది. ఎండిన నారు మేకలు మేపు తున్నం. సర్కారు ఆరుతడి పంటలు పెట్టమంటుంది. వాటికి గూడ నీళ్లు లేవు. వానలు పడకపోతే పత్తి చేను చేతికిరాదు. రైతు కుటుంబాలకు కరువుకాలమే వచ్చింది. ఇగ ఇల్లెల్లుడు కష్టమే.
– తోటకూరి బాలరాజు, రైతు, దేవరుప్పుల
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

