పర్వతగిరి, మార్చి 7 : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని అన్నారం శివా రు దూపతండా గ్రామంలో సాగు నీరందక సుమారు 100 ఎకరాల వరి, మకజొన్న ఎండిపోయింది. పకనే ఆకేరు వాగు ఉ న్నా.. అందులో నీళ్లు లేక బావులు, బోర్లు అడుగంటడంతో రైతులు అల్లాడుతున్నా రు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా వచ్చిన నీరు ఆకేరు వాగులో నిల్వ ఉండేదని, దీంతో సాగుకు ఇబ్బంది పడలేదని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సాగు నీరు అందుబాటులో లేక పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అప్పు లు తెచ్చి సాగు చేసిన పంట చేతికొచ్చేలా లేదని గ్రామంలోని సుమారు 45 మంది రైతులు కన్నీరు పెడుతున్నారు. కేసీఆర్ సారు ఎస్సారెస్పీ కెనాల్ ద్వారా నీరు వదలడంతో ఆకేరు వాగు జలకళ సంతరించుకొని భూగర్భ జలాలు పైపైకి వచ్చేవని అం టున్నారు. రేవంత్రెడ్డి సీఎం అయ్యాక వచ్చాక సాగు నీరు వదలడంలో సంబంధి త అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీంతో నీళ్లు లేక తమకు కన్నీళ్లే మిగిలాయ ని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడు రోజుల క్రితం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దృష్టికి సమస్యను తీసుకెళ్లగా స్పందించిన ఆయన వెంటనే మంత్రి ఉత్తమ కుమార్రెడ్డి, సంబంధిత అధికారులకు నీరు విడుదల చేయాలని ఫోన్లో విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని వాపోయారు. ప్రభుత్వంపై ఆగ్రహంతో స్థానిక రైతు గుగులోత్ పూల్సింగ్ ఎండిన తన పొలంలో గొర్లు, మేకలను మేతకు వదిలారు. గత పదేళ్లలో ఎన్నడూ ఇలా పంటలు ఎండిపోలేదని వాపోయారు. కాం గ్రెస్ పాలనలో కష్టాలపాలవుతున్నామని కన్నీటి పర్యంతమయ్యారు.
నేను, నా కొడుకు కలిసి ఐదు ఎకరా ల్లో వరి, మక్కజొన్న పంట సాగు చేశాం. రూ.లక్ష వరకు అప్పు తెచ్చి పెట్టుబడి పెడితే నష్టం వచ్చింది. నీటి సౌకర్యం లేక పంట మొత్తం ఎండింది. గత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా సాగునీటి కరువు వచ్చింది.
– గుగులోత్ పూల్సింగ్, రైతు, దూపతండా
మా ఊళ్లో 45 మంది రైతులకు సంబంధించిన సుమారు వంద ఎకరాల్లో పంటలు సాగునీరు లేక ఎండిపోయినయ్. గత సీఎం కేసీఆర్ సార్ హయాంలో పదేళ్లలో ఎన్నడూ సాగునీటి కోసం ఇంత ఇబ్బంది పడలేదు. రేవంత్రెడ్డి సీఎం అయ్యాక సాగునీరు లేక పంటలు ఎండిపోయి చాలా నష్టపోతున్నం.
– ధరంసోత్ జామిరి, మాజీ సర్పంచ్, దూపతండా