సంగెం, డిసెంబర్2: సంగెం శివారులో గ్రీన్ఫీల్డ్ హైవే సర్వేను సోమవారం రైతులు అడ్డుకున్నారు. అధికారులు ప్రశ్నించడంతో తమ విలువైన భూములను కోల్పోతున్నామని, ప్రభుత్వం సరైన నష్టపరిహారం ఇవ్వడం లేదని తా ము హైకోర్టును ఆశ్రయించినట్టు తెలిపారు.
హైకోర్టు దా వా ప్రతిని అందించడంతో అధికారులు తిరుగుముఖం పట్టారు. రైతులు దానం అశోక్, సరిత, యాకయ్య, సురే శ్కుమార్, శంకరయ్య, నూర రాధిక, కనకం రాజు, ఛాయాసుందరి, నూర శ్రీనివాస్, సోల మల్లికార్జున్, నర్సయ్య, మహేందర్, కంచం అయిలయ్య ఉన్నారు.