నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినా ఆశించిన వానల్లేక ఇటు రైతులు, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. పలుచోట్ల అడపాదడపా కొద్దిపాటి వర్షం కురుస్తుంటే మరికొన్ని చోట్ల ఎండవేడి హడలెత్తిస్తోంది. నిజానికి ఈ సమయంలో కురిసే భారీ వానలకు గొడుగుల అవసరం ఉంటుంది. ఇప్పుడు జూన్ 3వ వారంలోనూ ఎండ భయానికి జనం గొడుగులు, నెత్తిన తడకలతో వెళ్లిన దృశ్యాలు భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కనిపించా యి. అలాగే వరుణుడు కరుణించాలని సంగెం మండల కేంద్రంలో సోమవారం కప్పతల్లి ఆడి పోచమ్మకు గ్రామస్తులు పూజలు చేశారు.